Varshalu Kuruvale Tummeda Song Lyrics

రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
ముత్తైదు రాళ్ళవే తుమ్మెద నీవు ముందట మునివేళ్ళ తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
ముత్తైదు రాళ్ళవే తుమ్మెద నీవు ముందట మునివేళ్ళ తుమ్మెద
దిగవట్టు మడికట్టు తుమ్మెద మంచి దినుసు వచ్చేటట్టు తుమ్మెద
ముత్తైదు రాళ్ళవే తుమ్మెద నీవు ముందట మునివేళ్ళ తుమ్మెద
నింగిలో కొంగలు తుమ్మెద తొంగి వంగి చుసేటట్టు తుమ్మెద
పాటలింటూ నెమలి తుమ్మెద ప్రవేశించి ఆడేటట్టు తుమ్మెద
ముత్తైదు రాళ్ళవే తుమ్మెద ఓ రాగాల నా తల్లి తుమ్మెద
వడిపిల్లు బరుగుళ్లు తుమ్మెద ఓ కంట చూడవే తుమ్మెద
మిర్రలుంటే నేర్పి తుమ్మెద వరి కర్రలు నాటవె తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద

మిన్ను కురిసింది తుమ్మెద ఈ మన్ను మురిసింది తుమ్మెద
పారేటి ఏరులు తుమ్మెద ఇక పరవళ్లు తొక్కంగా తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద ఓ రాగాల నా తల్లి తుమ్మెద
సుట్టు మెట్లు చుట్టూ తుమ్మెద నిట్టనిలువున నిలుచుండె తుమ్మెద
పాటలకు చెట్లు తుమ్మెద గాలి గంధాలు పంచంగా తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
గాజులే నా రంగ తుమ్మెద ఈ మునివేళ్ళు తాళంగా తుమ్మెద
అలసట రాకుండా తుమ్మెద అలుగు దుంకేటట్టు పాడే తుమ్మెద
రావే రావే నల్ల తుమ్మెద ఓ రాగాల నా తల్లి తుమ్మెద
మబ్బులో మునిగేటి తుమ్మెద నీరు తెప్పేలే తేలేటి తుమ్మెద
కప్పల పెళ్లిళ్లు తుమ్మెద భలే గొప్పగా చేయాలె తుమ్మెద
వర్షాలు కురువాలే తుమ్మెద దిల్లీ బోగాలే పండాలి తుమ్మెద
పల్లె పట్నాలన్నీ తుమ్మెద భలే సంబరంగా ఉండాలే తుమ్మెద
భలే సంబరంగా ఉండాలే తుమ్మెద భలే సంబరంగా ఉండాలే తుమ్మెద

Leave a Comment