Srinivas Surya, sung by Sai Charan, Harini, music composed by Ram Tavva from the Telugu Cinema Kapatanataka Sutradari.
Ghallu Ghallu Kapatanataka Sutradari Song Lyrics penned byMovie | Kapatanataka Sutradari |
Director | Kranthi Saina |
Producer | Manish (Haleem) |
Singer | Sai Charan, Harini |
Music | Ram Tavva |
Lyrics | Srinivas Surya |
Star Cast | Bhanu Chandar, Vijay, Sampath, Chandu, Ameeksha |
Music Label |
Ghallu Ghallu Kapatanataka Sutradari Song Lyrics In Telugu
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు చిరు సవ్వడితోటి
కొత్త కొత్త ఊహలకే ఊపిరిపోసి
నిన్నలేని లోకమేదో కనులని తాకి
నింగి నేల హద్దు చెరిపి గమ్యము మార్చే
ఉదయపు వేకువే వెన్ను తట్టగా
మనమిక ఒకటిగా పయనమాడగా
తొలకరి చినుకులా పిలుపు అందగా
రేపటి పొద్దుపై ఆశ రేగగా
తలోదారి అన్నదే వదిలేద్దాం
ఒకరికొకరు తోడుగా నీడవుదాం
హే..ఘల్లు ఘల్లు ఘల్లుమంటు చిరు సవ్వడితోటి
కొత్త కొత్త ఊహలకే ఊపిరిపోసి
నిన్నలేని లోకమేదో కనులని తాకి
నింగి నేల హద్దు చెరిపి గమ్యము మార్చే
గాయమైన స్నేహమేరా… గతాన్ని మరిచేలా ఎదగాలిగా శిఖరానికే
కంచె లేని స్వేచ్ఛ కదరా… కష్టాలు చెదిరేలా కడవరకిలా గమ్యానికే
మెరుపుల వేగమే మాలో నిండగా తొనకని ధైర్యమే మాకే చెందెగా
కళ్ళల్లోని కాంతులే వెలిగిస్తాం… అంతేలేని అల్లరితో జతకడతాం, ఓఓ
కోటనైన కొట్టిచూడు గుండెల్లోన ధమ్ము నింపి
పొగరన్నదే చూపెయ్యగా
కడలిలోన అలలు చూడు తీరాన దాడి చూడు
తెగువన్నదే చాటెయ్యగా
తాకిన ఉలిగాటే బాధే నింపగ
రేపటి రూపానికి భావమిదేగా
కష్టాలన్నీ కన్నీళ్ళుగా వదిలేద్దాం
ఆశలకే ఆయువయ్యి అడుగేద్దాం, ఓ ఓ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు చిరు సవ్వడితోటి
కొత్త కొత్త ఊహలకే ఊపిరిపోసి
నిన్నలేని లోకమేదో కనులని తాకి
నింగి నేల హద్దు చెరిపి గమ్యము మార్చే