Ekkada Ekkada Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, music score provided by Mani Sharma, and sung this everlasting melody song by SP Charan & Harini from the Telugu cinema ‘Murari‘.
Movie | Murari (17 February 2001) |
Director | Krishna Vamsi |
Producer | Gopi Nandhigam |
Singer | SP Charan & Harini |
Music | Mani Sharma |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Mahesh Babu, Sonali Bindre |
Music Label |
Ekkada Ekkada Song Lyrics In Telugu
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహో.. అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నా కోసమే తళుక్కన్నదో… నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది… నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఒహో.. అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
కులుకులో ఆ మెలికెలు… మేఘాలలో మెరుపులు
పలుకులో ఆ పెదవులు… మన తెలుగు రాచిలకలు
పదునులో ఆ చూపులు… చురుకైన చురకత్తులు
పరుగులో ఆ అడుగులు… గోదారిలో వరదలు
నా గుండెలో అదోమాదిరి… నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి… అల్లేయకోయి మహా పోకిరి
మబ్బులో దాగుంది… తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది… బుగ్గల్లో పాకింది
ఒహూ.. తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఎవ్వరు నన్నడగరే… అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా… నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలి చినుకుని… కలగలిపి చూడాలనీ
ఎవరికి అనిపించినా… చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళిలా తనొస్తాడనీ… చూడాలటా ప్రతి దారినీ
ఏ తోటలో తనుందోననీ… ఎటు పంపనూ నా మనసునీ
ఏ నాడు ఇంతిదిగా… కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా… గుండెలకు కుదురుందా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహో.. అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
పూవానగా కురుస్తున్నది… నా చూపులో మెరుస్తున్నది
నా కోసమే తళుక్కన్నదో… నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
ఏ ఊరే అందమా ఆచూకి అందుమా
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగకా