Manidweepa Varnana Lyrics In Telugu – మణిద్వీపవర్ణన

Manidweepa Varnana Lyrics In Telugu
Pic Credit: Bhakthi Channel – Bhakthi TV (YouTube)

Manidweepa Varnana Lyrics In Telugu. Manidweepam is also known as Swarnalokam. It is above Brahmalokam.

Manidweepa Varnana Lyrics In Telugu

మహా శక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రం రూపిణి
మన మనస్సులలో కొలువై ఉంది

సుగంధ పరిమళ పుష్పాలెన్నో
వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు

లక్షల లక్షల లావన్యాలు
అక్షర లక్షల వాక్సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు

పారిజత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే
మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవున గలవు
మధుర మధుర మగు చందన
సుధలు మణిద్వీపానికి మహానిధులు

అరువది నాలుగు కళామతల్లులు
వరలనోసగే పదారుశక్తులు
పరివారముతో పంచ బ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు

అష్టసిద్ధులు నవనవ నిధులు
అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తల సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు

కోటి సూర్యుల ప్రచండ కాంతులు
కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే
మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

కంచు గోడల ప్రాకారాలు
రాగి గోడల చతురస్రాలు
ఏడామడల రత్న రాశులు
మణిద్వీపానికి మహానిధులు

పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాదిపతులు
మణిద్వీపానికి మహానిధులు

ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటల వైడూర్య
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు

సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వ శుభప్రధ ఇచ్చాశక్తలు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే
మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మిలమిలలాడే ముత్యపు రాశులు
తలతలలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు

కుబేర ఇంద్రవరుణదేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు

భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ధులు
పంచభూతములు పంచాశక్తులు
సప్త ఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు

కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్య కాంతి శిలమహాగ్రహాలు
ఆరుఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే
మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మంత్రిని దండినీ శక్తి సేనలు
కాళీ కరాళి సేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు

సువర్ణరజిత సుందరగిరులు
అనంతదేవీ పరిచారికలు
గోమేదికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు

సప్తసముద్రములనంత నిధులు
యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు

మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయకారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే
మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు
మణిద్వీపానికి మహానిధులు

దివ్యఫలములు దివ్యాస్త్రములు
దివ్యపురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు
మణిద్వీపానికి మహానిధులు

శ్రీ విగ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు

పంచభూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే
మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

చింతామణులు నవరత్నాలు
నూరామడల వజ్రరాశులు
వసంతవనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు

దుఖము తెలియని దేవీ సేనలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు

పదనాల్గు లోకాలన్నిటి పైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మనిద్వీపం
సర్వేశ్వరీకది శాశ్వతస్థానం

చింతామణుల మందిరమందు
పంచాబ్రహ్మలు మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరీతో
నివసిస్తాడు మనిద్వీపములో

భువనేశ్వరీ సంకల్పమే జనియించే
మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మనిద్వీపములో

పరదేవతను నిత్యము కొలిచిమనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలు ఇచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
పరదేవతను నిత్యము కొలిచిమనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలు ఇచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది

నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదలు తులతూగేరు

నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదలు తులతూగేరు

Listen మణిద్వీప వర్ణన


Video Source: BHAKTHI | GURU BHAKTHI
Category: Telugu Devotional

శివకవితేస్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంట
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం

Leave a Comment